My pic

Feb 13, 2010

ఒక నాటి సాయంత్రం

నిన్న ఒక మంచి పాటవిన్నాన్రా సీను "కిరాతార్జునీయం" వేటూరి వ్రాసినది...

అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తాడు దానితో ...."కంపించెనంతలో కైలాసమావేళ కనుపించెనంత అకాల ప్రళయ జ్వాల" ఇది గమనించిన సాంబ శివుడు చిరు నవ్వు తో అంబ వైపు చూశాడు, సీను, సాంబ అంటే "అంబ తో కూడి వున్నా వాడు" అని అర్థం వేటూరి ఎంత బాగా రాస్తాడు ఇక్కడ తెలుసా, "జగము లేలిన వాని సగము నివ్వెర బోయే, సగము మిగిలిన వాని మొగము నగవై పోయే" ఇక అర్జునుడికీ శివుడికి యుద్ధం, మరి అర్జునుణ్ణి రాబోయే భారత సంగ్రామంలో విజయునిగా నిలబెట్టాలి కదా! కిరాతునిగా శివుడి మారతాడు కూడా అమ్మ తరలి వచ్చింది.

అనితర సాధ్యంగా మన వేటూరి కూడా వ్రాస్తాడు "నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె తలపైని గంగమ్మ తలపులోనికి బారె" చూసావా ఇక్కడ "గంగ", ఆలోచన" రెండూ కూడా "పారే" లక్షణం కలవి కదా!! అందుకే కవి గంగమ్మను శివుని "తలపులోనికి" ప్రవహింప చేసాడు, నిప్పులువిసే కన్నునిదురోయి బొట్టవుతే, బూది పూతకు మారు పులితోలి వలువయ్యిందిట, ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారె తాను అరుకతగా అని శ్లేష చాల బాగా ప్రయోగించాడు కవి... ఎంత మంచి భావం కదరా శీను!! అసలు పద గుంభనం అంటే మన వేటూరిదే సుమా సప్త పది లో కూడా "రేపల్లియ...." పాట లో "మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి...." అని చాల అందంగా అంటాడు మన వేటూరి....

నిజమేరా అసలు తెలుగు లోనే వుంది ఈ అందం అంతా, కదా!! ఇద్దరమూ సంతృప్తిగా నవ్వుకుని ఆ రోజుకి ఇళ్ళకి బయలు దేరాం.
.........





3 comments:

  1. Good to read this blog. Looks like AnandoBrahma prediction is coming true

    ReplyDelete
  2. నన్ను ఉత్తేజ పరిచిన ఒక పాట , సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినది.

    ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....
    విశ్రమించ వద్దు ఏ క్షణం--విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా......
    నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....
    సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....
    పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...
    గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...
    నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...
    రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా...
    నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
    నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ...
    దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున...
    ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను.ఆశయమ్ము సారధవును రా..
    నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...
    ఆయువుంటూ ఉన్నవరకు చావు కుడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాతుర

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete